లైంగిక వాంఛల కోసం బాలుడిని వేధిస్తున్న డ్రైవర్ కు 7 ఏళ్ళ జైలుశిక్ష
- September 02, 2016
సాంకేతిక పరిజ్ఞానంను కొందరు విపరీత పోకడలకు వాడుకొని విజ్ఞానం అంటేనే విరక్తి పుట్టిస్తున్నారు. తన లైంగిక వాంఛల కోసం ఒక 13 ఏళ్ల బాలుడిని పదే పదే అత్యాచారం చేస్తున్న ఓ కామాందుడు చివరకు కట కటాల పాలవ్వక తప్పలేదు. వాట్స్ అప్ సందేశం ద్వారా ఎక్కడకి రావాలో..ఏమేమి చేయాలో తదితర మెసేజ్ లను ఓ బాలునికి పంపుతున్న ఓ పాకిస్థాన్ డ్రైవర్ చివరకు ఆ బాలుని తండ్రి మొబైల్ పరిశీలనలో అడ్డంగా దొరికిపోయాడు. దీనితో ఆగ్రహించిన ఆ తండ్రి పోలీసులకు పిర్యాదు చేసారు. దీనితో వారు గురువారం కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ముందు ప్రవేశపెట్టిన ఆ డ్రైవర్ కు ఏడేళ్ల సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, తన వద్ద పనిచేసిన 26 ఏళ్ల పాకిస్తానీ మాజీ డ్రైవర్ ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నట్లు తాను కొనుగొనినట్లు పేర్కొన్నాడు. లైంగిక వాంఛల కోసం తన కుమారుడిని ఉపయోగించుకొంటున్నట్లు ఒక వాట్స్ అప్ సందేశాన్ని పంపడం ద్వారా తెలిసిందన్నారు. తాను విదేశాల్లో పనిచేసే ఎమిరేట్ వాసినని న్యాయవాదులతో చెబుతూ, తన కుటుంబంతో కలిసి సెలవులు గడపడానికి స్వదేశానికి వచ్చినపుడు ఈ సంగతి తెలిసిందన్నారు. సెప్టెంబర్, 2015 లో తిరిగి వచ్చినపుడు తన కుమారుడు తనకు జరుగుతున్నదేమిటో తెలియక వెలుపలకు ఏమీ చెప్పలేక సతమతమవుతూ డ్రైవర్ కు సహకరిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడినట్లు తెలిపారు. నేను ఒక సందర్భంలో నా కుటుంబంతో కలిసి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నప్పుడు నా కుమారునికి ఒక వాట్స్ అప్ వాయిస్ మెసేజ్ ఫోన్ కు వచ్చింది దానిని అందుకొని పక్కకు వెళ్లి చదివి తిరిగివచ్చిన తన కుమారుడు ఎంతో ఆందోళనగా ఉండటం కనిపించింది. ఎవరితో మాట్లాడేవని నిలదీసినప్పుడు ఒక స్నేహితుడు అని చెప్పాడు. అనుమానం కల్గిన నేను నా కుమారుని మొబైల్ ఫోన్ తీసుకొని ఆ వాట్స్ అప్ వాయిస్ మెసేజ్ పరిశీలించి వినగా, అరబిక్ బాష సరిగా మాట్లాడటం రాని ఒక మనిషి కంఠాన్ని విన్నాను . నేను ఫోన్ తనిఖీ చేయగా అది పంపిన వ్యక్తి గతంలోనూ అనేక ఇతర సందేశాలు పంపిన సంగతి బోధ పడింది. ఆ గొంతుగల వ్యక్తి ఐదు నెలల క్రితం తన వద్ద కారు డ్రైవర్ గా పనిచేసి మానివేసిన పాకిస్థాన్ డ్రైవర్ గొంతుకగా గుర్తించినట్లు తెలిపాడా తండ్రి. పాకిస్థాన్ డ్రైవర్ తన లైంగిక కోరికల కోసం తన కుమారుని మాల్స్ కు తీసుకువెళతాడని సమయం దొరికినపుడు తన కారులో ఒంటరిగా ఉంచి అత్యాచారం జరిపేవాడని న్యాయస్థానం ముందు విన్నవించుకొన్నాడా తండ్రి...అంతే కాకుండా తన కుమారుని మొబైల్ ఫోన్లో నగ్నంగా చిత్రీకరించి కోరిక తీర్చకపోతే వాట్స్ అప్ ద్వారా ఆ ఫోటోలను వీడియోలను అందరకి పంపుతానని బెదిరించేవాడని దాంతో తన కుమారుడు అతనికి లొంగిపోయేవాడని తెలిపాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







