నాని తో సినిమా తీయనున్న అవసరాల
- September 03, 2016
అష్టాచమ్మ సినిమాతో యంగ్ హీరో నాని, నటుడు కం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కెరీర్ ఒకేసారి మొదలైంది. ఈ సినిమా తరువాత నాని హీరోగా సెటిల్ అవ్వగా, అవసరాల శ్రీనివాస్ మాత్రం కామెడీ పాత్రలు చేస్తూనే దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసిన అవసరాల దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అవసరాల శ్రీనివాస్.. ఆ తరువాత నాని హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుస సక్సెస్ లతో నాచురల్ స్టార్ గా ఎదిగిన నాని కూడా అవసరాలతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమై సినిమాలు చేసే ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







