చైల్డ్ సేఫ్టీపై దుబాయ్ ట్యాక్సీ, హుండై 'ఎంఓయూ'
- September 03, 2016
రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ)కి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్, అలాగే హుండై - జుమా అల్ మజిద్ మధ్య మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) కుదిరింది. ట్యాక్సీల్లో చిన్న పిల్లల భద్రత విషయమై ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ సిఇఓ డాక్టర్ యూసుఫ్ మొహమ్మద్ అల్ అలి, హుండై మోటర్ గ్రూప్ ప్రెసిడెంట్ ఎక్సెల్ డ్రెయర్ ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. డిటిసి ట్యాక్సీ క్యాబ్‌లలో చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేక సీట్ల ఏర్పాటు విషయంలో హుండై సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది ఈ ఒప్పందం ప్రకారం. ప్రయాణీకుల భద్రత నేపథ్యంలో దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ తమతో చేసుకున్న ఒప్పందం పట్ల హుండై వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ, అందులో ఇది కూడా ఒకటని డ్రెయర్ చెప్పారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







