ఒమాన్, రాస్ అల్ ఖైమాలో భారీ వడగళ్ళ వర్షం, మునిగిన లోయలు

- August 03, 2015 , by Maagulf
ఒమాన్, రాస్ అల్ ఖైమాలో భారీ వడగళ్ళ వర్షం, మునిగిన లోయలు

ఈ ఆదివారం భారీ వడగళ్ళ వానలు రాస్ అల్ ఖైమాలోని ముసఫి మరియు ఇతర ప్రదేశాలను వరదల్లో ముంచెత్తాయి. ఇక్కడి అల్ అజిలీ లోయలో వరసగా రెండవరోజున కూడా కురిసిన ఈ వర్షాలు వర దకు దారితీశాయి. ఇక ఫూజరియాలో కూడా భారీవర్షాలు కురిసినట్టు సమాచారం. ద నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రోలోజీ అండ్ సేస్మోలజీ వారి సమాచారం ప్రకారం దేశంలోని దక్షిణ మరియు తూర్పు ప్రాంతాలలో నేడు, రేపు కూడా వాతావరణం మేఘావృతమై ఉంటుంది. వర్షం, ఒక మోస్తరు ఈదురుగాలులు కూడా వీస్తాయి. దుమ్ము, ఇసుక రేగి దృష్టి పధానికి ఇబ్బందులు తలఎత్తవచ్చు. అరేబియా గల్ఫ్‌లో ఒక మోస్తరుగా, ఒమన్ సముద్రంలో ఉధృతంగా అలలు రేగుతాయి.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com