బీట్రూట్ గవ్వలు
- September 04, 2016
కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము - 2 కప్పులు, మైదా - రెండు కప్పులు, కార్న్ ఫ్లోర్ - 2 కప్పులు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, జీడిపప్పు పొడి - పావు కప్పు, పంచదార - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, తేనె - 5 టీ స్పూన్లు, (వేడి) నెయ్యి - 3 టీ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఏలకుల పొడి - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: బీట్రూట్లో కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్‌చేసి రసం తీసి, ఈ రసాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్, కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి, తేనె, నెయ్యి వేసి తగినంత బీట్రూట్ రసంతో ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టి తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండల్ని (గవ్వల పీటపై) గవ్వల్లా చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. మరో పాత్రలో బెల్లం, పంచదార మిగిలిన బీట్రూట్ రసం, ఏలకుల పొడి వేసి పాకం తీసి, వేగిన గవ్వలు వేయాలి. గవ్వలకు పాకం బాగా పట్టాక తీసి ఆరబెట్టుకోవాలి. గవ్వలు ఎర్రగా ఉండి చూడ్డానికి అందంగా కనిపిస్తాయిa
తాజా వార్తలు
- బంగాళాఖాతంలో బీభత్సం..ఏపీకి భారీ వర్షాల ముప్పు!
- ఇజ్రాయెల్ ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
- ఖతార్‌లో ఘనంగా తెలంగాణ వైభవం 2026.. బతుకమ్మతో సాంస్కృతిక సందడి
- సౌదీ అరేబియాలో డ్రోన్లు, క్షిపణుల కలకలం..
- ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత..రూ.4 కోట్ల గంజాయి స్వాధీనం!
- బహ్రెయిన్‌లో కర్జకాన్ సముద్ర తీరానికి కొత్త రూపు..!!
- దోహా మెట్రో బస్సు రూట్లలో మార్పులు..!!
- పిల్లల్లో కిడ్నీ వ్యాధులు.. లక్షణాలు కనిపించేలోపే గుర్తించడం ముఖ్యం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ లు..!!
- కువైట్‌లో అమీరీ దివాన్ హార్స్ వేలం..!!







