కాలుష్య వాతావరణం మధుమేహులను ఎలా ప్రభావితపరుస్తుంది?

- September 04, 2016 , by Maagulf
కాలుష్య వాతావరణం మధుమేహులను ఎలా ప్రభావితపరుస్తుంది?

ప్రధానంగా మధుమేహ వ్యాధి 3 రకాల అవి : జన్యుపరంగా సంక్రమించే టైప్-1 డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత వలన సంభవించే టైప్-2 డయాబెటిస్ మరియు గర్భ సమయంలో మాత్రమే కలిగే టైప్-3 డయాబెటిస్ లేదా గర్భధారణ మధుమేహంను మూడు రకాలు ఉన్నాయి. నిజానికి శరీర రక్తంలోని చక్కెరలో మార్పుల వలన కలిగే వ్యాధి మరియు దీని వలన గుండె సంబంధిత వ్యాధులు మరియు మూత్ర పిండాల ఆరోగ్యం కూడా పాడై తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది. ఆహర ప్రణాళికలు, వ్యాయామాలు మరియు మందుల వాడకం ద్వారా మాత్రమే మధుమేహాన్ని నిర్వహించటమే కాకుండా, మన చుట్టూ ఉండే వాతావరణం మధుమేహ వ్యాధిని ఎలా ప్రభావిత పరుస్తుందో తెలుసుకోటం మంచిది.

How environment affects diabetes in Teugu
మధుమేహం పై వాతావరణ ప్రభావం
నిరంతరంగా కాలుష్యంతో కూడిన గాలిని పీల్చటం వలన అనియంత్రిత బరువు పెరుగుదల కలుగుతుంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీ లలో కాలుష్యం అధికంగా ఉండటం వలన అధికంగా ఈ సమస్యను గమనించవచ్చు. ఈ విధంగా పెరిగిన బరువు మధుమేహా వ్యాధిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. కాలుష్యంతో కూడిన గాలి పీల్చటం వలన ఇన్సులిన్ నిరోధకతకు కారణం కావచ్చు. అధిక కాలుష్య పరిస్థితులు మధుమేహా వ్యాధి గ్రస్తులలో గుండె సంబంధిత జబ్బులకు కారణం కావచ్చు. ఎందుకంటే వీరిలో రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించలేని స్థాయికి చేరుకుంటాయి కావున ఈ విధమైన సంక్లిష్టతలు కలుగుతాయి.
కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారా? అయితే మీరు స్మోక్ చేస్తున్నారని అర్థం. పొగ వాతావరణానికి బహిర్గతం అవటం వలన మధుమేహా వ్యాధి గ్రస్తులలో స్మోక్ చేసే వారిలో దుష్ప్రభావాలు కలిగినట్టే ఈ పరిస్థితిలో కలుగుతాయి. పొగను పీల్చటం వలన ధమనుల గోడల లోపలి వైపు ఇన్ఫ్లమేషన్ కలిగి గుండె సంబంధిత వ్యాధులు కలుగుతాయి, ఈ పరిస్థితులు మధుమేహ వ్యాధి గ్రస్తులలలో తీవ్ర పరిణామాలకు దారీ తీస్తాయి. కావున, కాలుష్య వాతావరణానికి దూరంగా ఉండటం మంచిది. మీకు పొగతాగే అలవాటు లేకున్నా, కాలుష్య వాతావరణానికి దూరంగా ఉండండి.
మన చుట్టూ ఉండే వాతావరణం నుండి మనపై పడే మరొకటి- ఒత్తిడి మధుమేహ వ్యాధిని చాలా వరకు ప్రభావిత పరుస్తుంది. ఒత్తిడి వలన మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి దీని వలన మన శరీర బరువు పెరుగుతుంది. ఇలా పెరిగిన బరువు మధుమేహ వ్యాధి గ్రస్తులను గాయపరుస్తుంది. మన శరీర లేదా మనసు ఒత్తిడికి గురైనపుడు, అధిక కేలోరీలను అందించే ఆహార పదార్థాలను, చాక్లెట్, స్వీట్ వంటి వాటిని ఎక్కువగా తింటాము. వీటి ఫలితంగా మధుమేహా వ్యాధి గ్రస్తులు చాల సమస్యలు ఎదుర్కోవాలి. అంతేకాకుండా, ఒత్తిడి గుండెపై అనేక ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. అంతేకాకుండా, ఒత్తిడి వలన భౌతిక కార్యలకు మరియు ఆరోగ్యకర అలవాట్లకు దూరంగా ఉంటాము. వీటి ఫలితంగా మధుమేహా వ్యాధి గ్రస్తులలో ప్రాణాంతకర పరిస్థితులు ఏర్పడతాయి.

మన చుట్టూ ఉండే వాతావరణం మధుమేహా వ్యాధిని ఎలా ప్రభావిత పరుస్తుందో తెలుసుకోవటం చాలా మంచిది, ఎందుకంటే వాతావరణంలో ఉండే కాలుష్య కారకాలు, విష పదార్థాలు చాలా సమస్యలను కొని తెస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com