అన్నం బోండాలు
- September 05, 2016
కావలసినవి: నాలుగు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రెండు టీస్పూన్ల పంచదార, ఒక టీస్పూను ఉప్పు సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్, ఒక టీస్పూను చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూను వెనిగర్, సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పెడు, రెండుకప్పుల అన్నం (ఫోర్క్‌తో లేదా పొటాటో మాషర్‌తో అన్నాన్ని చిదమాలి), ముప్పావు కప్పు పల్లీ పప్పుల ముక్కలు, నూనె.
తయారీ:
అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పంచదార, పచ్చిమిరపలను మిక్సీ పట్టి ఈ మిశ్రమానికి సోయా, చిల్లీ సాస్‌లు, వెనిగర్, కొత్తిమీర కలపాలి. దీనంతటినీ చిదిమిన అన్నానికి కలపాలి. చేతులకి కొద్దిగా నూనె రాసుకుని అన్నం మిశ్రమాన్ని 18-20 భాగాలుగా చిన్న ఉండలుగా చేయాలి.
పల్లీ గింజల పప్పులను ఒక ప్లేట్లో చల్లి ఒక్కో ఉండను పల్లీగింజలు బాగా అంటుకునేవరకు దొర్లించాలి. కళాయిలో నూనెను వేడిచేసి అన్నం ఉండల్ని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. ఈ ఉండల్ని టిష్యూ పేపర్ మీద వేస్తే నూనె పీల్చుకుని తరువాత కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇవి ఇరవైమందికి సరిపోతాయి. తయారీకి 30 నిముషాలు పడుతుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







