బాగ్దాద్ లో కారు బాంబుతో దాడి : 7 మంది మృతి
- September 05, 2016
ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి.ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







