రెహా సన్ ఫెస్ట్ & కరోకె నైట్ 2016
- September 05, 2016
ఇటీవల కొత్తగా ప్రారంభమైన రెహా మ్యూజిక్ మరియు షడాన్స్ ఇన్‌స్టిట్యూట్, తాజాగా రెహా సన్‌ఫెస్ట్ అండ్ కరోకె నైట్ 2016 పేరుతో ఓ ఈవెంట్‌ని నిర్వహించింది. రెండు నెలలపాటు సాగిన సమ్మర్ క్యాంప్‌కి ఫినాలెగా ఈ ఈవెంట్‌ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.గల్ఫ్ మోడల్ స్కూల్, అల్ ముహైసినాలో జరిగిన ఈ వెంట్‌కి పలువురు ప్రముఖులు, పేరెంట్స్, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. 3 నుంచి 14 ఏళ్ళలోపు విద్యార్థులు తమ టాలెంట్‌ని ఈ వేదికపై ప్రదర్శించారు. సమ్మర్ క్యాంప్‌లో తాము నేర్చుకున్న పలు విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. పాటలు, డాన్స్, మిమిక్రీ వంటివాటితో మూడు గంటలపాటు ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈ ఈవెంట్‌లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. విజయ్ భాస్కర్ టీమ్ నేతృత్వంలో తమిళ్ ఫోక్ బేస్డ్ మ్యూజిక్ బ్యాండ్ 'అంతరా'తో ఈ కార్యక్రమం ముగిసింది. రెహా మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు రేణుక, హరిదా ఆహూతులకు కృతజ్ఞతలు తెలిపారు.




తాజా వార్తలు
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !







