యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ నుంచి నిష్క్రమించిన బోపన్న జోడీ
- September 05, 2016
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు కనబరిచారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. మిక్స్డ్ డబుల్స్ నుంచి బోపన్న జోడీ నిష్క్రమించింది.
ప్రీక్వార్టర్స్‌లో అమెరికా, జపనీస్ జోడీ నికోలే గిబ్స్- నావో హిబినోపై సానియా-స్ట్రైకోవా ద్వయం 6-4, 7-5 వరుస సెట్లతో గెలుపొందింది. దీంతో మహిళల డబుల్స్‌లో సానియా జోడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఫ్రెంచ్ టాప్ సీడ్స్ కరోలిన్ గార్షియా-క్రిస్టినాతో సానియా జోడీ తలపడనుంది. .
ఇక మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో ఓటమిపాలైన బోపన్న జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్‌లో రాబర్ట్ ఫరా(కెనడా), అన్నా లెనా(జర్మనీ) జోడీ చేతిలో బోపన్న-డబ్రోవ్స్కీ ద్వయం 6-1, 2-6, 8-10 సెట్లతో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







