రవితేజ హీరోగా విక్రమ్ సిరి దర్శకత్వంలో వంశీమోహన్ సమర్పణలో నల్లమలుపు బుజ్జి
- September 05, 2016
'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఎన్టీఆర్ తో 'అదుర్స్' నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'రేసు గుర్రం' చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు విక్రమ్ సిరి.
ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.
త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ - ''రవితేజ హీరోగా మా సంస్థలో ఇది మొదటి సినిమా. మంచి కథ కుదిరింది. వక్కంతం వంశీ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ తయారు చేశారు. శాసన సభ్యుడైన వల్లభనేని వంశీతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రాజేష్.
తాజా వార్తలు
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత







