చంద్రబోస్‌కు అరుదైన పురస్కారం
- September 06, 2016
ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నెల 14వ తేదీనాడు రవీంద్రభారతిలో జరగనున్న కాళోజీ పురస్కార వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. స్థానిక మధురానగర్ కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
ఏటా టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా మహాకవి కాళోజీ స్మారక పురస్కారాలను వివిధ రంగాల్లో రాణిస్తున్న రచయితలకు అందజేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది ఈ అవార్డును సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు, 2014లో జేకే భారవికి అందజేసినట్టు పేర్కొన్నారు.
కాగా చంద్రబోస్‌కు పురస్కారం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ.10,116 నగదును అందించనున్నామన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







