భారీ అగ్నిప్రమాదం: 100 మందికి తప్పిన ప్రాణగండం
- September 06, 2016
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాలోని గసిదత్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 100 మందికి పైగా కార్మికులు బస చేసిన ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర భయాందోళనల నెలకొన్నాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే రస్ అల్ ఖైమా పోలీసులు అలర్ట్ అయ్యారు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ వెంటనే స్పందించింది. రికార్డు సమయంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా ప్రాణ నష్టం తగ్గించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం అక్కడున్న 100 మంది కార్మికుల్నీ రక్షించగలిగారు. ఆ తర్వాత నీరు, ఫోమ్ ఉపయోగించి మంటల్ని అదుపుచేయగలిగారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మంటల్ని అదుపు చేయడం పట్ల ఫైర్ ఫైటర్స్‌కి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. నిద్రలో ఉండగా అగ్ని ప్రమాదం సంభవించిందని భారీయెత్తున ఎగసిపడ్డ మంటల్లోంచి తాము ప్రాణాలతో బయటపడ్తామని అనుకోలేదని పాకిస్తాన్‌కి చెందిన కార్మికుడొకరు చెప్పారు. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, సుదూర ప్రాంతాల నుంచి కూడా పొగ, మంటలు కనిపించాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







