దుబాయ్ - అల్ ఐన్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
- September 07, 2016
దుబాయ్ : స్థానిక దుబాయ్ - అల్ ఐన్ రోడ్డుపై ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. మంగళవారం ఒక మినీబస్సు దుబాయ్ అల్ ఐన్ రోడ్డు పక్కన నిలిపిన సమయంలో ఒక పికప్ ట్రక్ వేగంగా వచ్చి మినీబస్సుని ' ఢీ ' కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శోధన మరియు రెస్క్యూ శాఖ, డిఫికల్టీ మిషన్ టాస్క్‌ఫోర్స్ నుండి మేజర్ ఆలీ అల్ నాక్బి మాట్లాడుతూ, తమ శాఖ నుండి ఒక జట్టు, ఫోరెన్సిక్స్ , దుబాయ్ సివిల్ డిఫెన్స్ నుండి మరొక జట్టు తక్షణమే ప్రమాద స్ధలానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మినీబస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మరణించాడు. ప్రమాదంలో గాయపడినవారిలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వారు కాగా ఒకరు అరబ్ వ్యక్తి. ఇరు వాహనాలు డీ కొన్న సమయంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం రంగంలోనికి దిగి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







