రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు..
- September 07, 2016
కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా సదరు ఎఫ్ఐఆర్లను ఆయా వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ శాఖలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.ఎఫ్ఐఆర్ను 24 గంటల్లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటూ ఇటీవల దిల్లీ హైకోర్టు నగర పోలీసులను ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. భారత యువ లాయర్ల అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం..దిల్లీ హైకోర్టు ఆదేశాలను అంగీకరిస్తూనే, కొన్ని మార్పులు చేసింది.అన్ని రాష్ట్రాల పోలీస్ అధికారులు 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. తొలుత 48 గంటల సమయం ఇవ్వాలని భావించినప్పటికీ.. 24 గంటల పరిమితినిస్తూ తీర్పు చెప్పింది. ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో మాత్రం 72 గంటల్లోగా అప్లోడ్ చేసేందుకు అనుమతినిచ్చింది. కాగా.. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ను అప్లోడ్ చేయడంలో మినహాయింపు కల్పించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







