యుఎఇ సందర్శన వీసా కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్త
- September 07, 2016
మనామా: బహ్రేయినీ నివాసితులు తగినంత జాగ్రత్తగా లేకుంటే ఆన్ లైన్ లో యుఎఇ సందర్శన వీసా కోసం సుమారు మూడురెట్లు సొమ్ము చెల్లించే ప్రమాదం ఏర్పడేవచ్చు.యుఎఇ సందర్శించాలంటే ఒక స్వల్పకాలిక పర్యటన వీసా 24 బి డి మాత్రమే ఖర్చవుతుంది, కానీ కొన్ని వెబ్సైట్లను ఇందుకు 70 బి డి లకు ఆ వీసా ను అందిస్తున్నాయి. ఈ విషయం తెలియని కొందరు ఆన్ లైన్ వినియోగదారులు, గూగుల్ ద్వారా ఖరీదైన ఎంపిక చేసుకొని నష్టపోతున్నారు. యుఎఇ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా యుఎఇ ఇ-వీసా కోసం నివాసితులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, గూగుల్ లో శోధించడం ద్వారా అధికారిక వెబ్సైట్ కనుగొనడంలో అంత సులభం కాదు. ఎందుకంటే గూగుల్ శోధన ఫలితాల్లో అధికమొత్తంలో అసంఖ్యాక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి ఇటీవల,ఒక మనామా నివాసి యుఎఇ సందర్శన వీసా కోసం 70 బి డి చెల్లించాడు.నేను కంప్యూటర్ లో పై స్థానంలో ఉన్న శోధన ఫలితంపై క్లిక్ చేశాను. నేను అధికారిక వెబ్సైట్ ఉపయోగించి ఉంటె దరఖాస్తు ప్రక్రియ లో తక్కువ చెల్లించి ఉండేవాడిని. నేను తప్పు స్థానంలో దరఖాస్తు మరియు డబ్బు చెల్లించాను. ఇతరులు నా అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలని ఆయన అన్నారు. సరైన వెబ్సైటు కోసం యుఎఇ రాయబార కార్యాలయం ను సంప్రదించగా ఒక ప్రతినిధి ఇ-వీసా పొందడానికి వారి అధికారిక వెబ్సైట్లు www.government.ae మరియు www.ednrd.ae అని వెల్లడించినట్లు తెలిపారు. మీరు ఆ వెబ్సైట్లలో ఒక ఖాతా ద్వారా సుమారు 24 బి డి లను చెల్లించి అవసరమైన దశలను పూర్తి చేయవచ్చు. అంతకన్నా వీసా ఖర్చు ఏమీ ఉండదని ఆ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







