రాష్ట్రం నలుమూలలకు ఐటీ శాఖ..
- September 07, 2016
తెలంగాణాలో ఐటీ అంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఒక్కటే కాదని రాష్ట్రం నలుమూలలకు ఈరంగం విస్తరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్మిన మంత్రి కేటీఆర్. ఆ దిశగా చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐటీ శాఖ పరిధిలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన రూరల్ టెక్ పాలసీ ద్వారా ఇప్పటికే మూడు జిల్లాల్లో నాలుగు ప్రఖ్యాత కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని జిల్లాల్లో కంపెనీలు స్థాపించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పల్లె ప్రాంతాలకు సాంకేతిక కొలువులు తీసుకువెళ్ళాలన్నది కేటీఆర్ లక్ష్యం. దీనికి సంబంధించి ప్రత్యేక ఉపపాలసీని కూడా ప్రకటించారు. ఇన్ఫోటెక్ వరంగల్లో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 1800 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే కరీంనగర్ జిల్లాలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, హుజూరాబాద్ లో తెలెకా నెట్ వర్కింగ్ టెక్నాలజీస్ ను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 260 మందికి ఉపాధి దక్కనుంది. మరోవైపు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన శాండ్ బాక్స్ మరింద వినూత్నంగా పనిచేస్తున్నది. ఇక మరికొంత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇక హైదరాబాదు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవలసిన అవసరం ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పినట్లే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







