ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఆవిష్కరించిన ఆపిల్ సంస్థ..
- September 07, 2016
ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయిన ఐఫోన్ సెవెన్, 7 ప్లస్ మొబైల్ మోడల్స్ ను ఆపిల్ సంస్థ ఆవిష్కరించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇతర ప్రముఖులు ఈ లేటెస్ట్ మొబైల్స్ ను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్‌ను కూడా విడుదల చేశారు. 32 జీబీ వెర్షన్ ఉన్న ఐఫోన్ 7 ప్రారంభ ధర 649 డాలర్లు ఉండగా.. ఐఫోన్ 7 ప్లస్ రేటు 769 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. 128, 256 జీబీ వెర్షన్లలోనూ ఈ మొబైల్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ సెవెన్ కు 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ ఉండగా.. వెనుక భాగంలో 12 మెగా పిక్సల్స్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అదే ఐఫోన్ 7 ప్లస్ లో 5.5 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ సహా... ఇంత వరకూ ఏ ఫోన్‌లోనూ లేని విధంగా యాపిల్ ఐఫోన్ 7 ప్లస్‌కు కెమెరా పరంగా సరికొత్త హంగులు అద్దింది. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 7 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ హెచ్‌డీ కెమెరా సైతం ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







