442 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష

- September 08, 2016 , by Maagulf
442 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష

అబుదాబీ: ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, 442 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా ఈ ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు షేక్‌ ఖలీఫా. పలు కేసుల్లో వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, ఫైనాన్షియల్‌ ఆబ్లిగేషన్లను కూడా సెటిల్‌ చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు షేక్‌ ఖలీఫా. యూఏఈ ప్రెసిడెంట్‌, వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇకపై తమ కొత్త జీవితాన్ని ఆనందకరంగా తిరిగి ప్రారంభించేందుకు, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు వీలుగా క్షమాభిక్ష ఇచ్చారు. అజ్మన్‌లో సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, అజ్మన్‌ రూలర్‌ షేక్‌ హుమైద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ నౌమి 110 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com