గల్ఫ్ ఎయిర్‌కి ప్రతిష్టాత్మక అవార్డ్
- September 08, 2016
మనామా: గల్ఫ్ ఎయిర్ తాజాగా బెస్ట్ ఐటీ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అవార్డ్‌ని సొంతం చేసుకుంది. సెక్యూరిటీ ఎడ్వైజర్ మిడిల్ ఈస్ట్ ఈవెంట్లో ఈ అవార్డ్ దక్కింది. సిపిఐ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో దుబాయ్‌లోని అల్ హబతూర్ గ్రాండ్ హోటల్లో ఈ వెంట్ జరిగింది. సెక్యూరిటీ డెసిషన్ మేకర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ మిడిల్ ఈస్ట్ కంపెనీల నుంచి పలువురు ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవార్డ్ గల్ఫ్ ఎయిర్‌కి ఏడవది. ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున గల్ఫ్ ఎయిర్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ జసిమ్ హాజి ఈ అవార్డ్‌ని అందుకున్నారు. 2015లో గల్ఫ్ ఎయిర్ ప్రపంచంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన తొలి ఎయిర్‌లైన్ సంస్థగా అవతరించింది. క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ విభాగాల్లో చూపిన ప్రత్యేకత నేపథ్యంలో ఈ గౌరవం దక్కించుకుంది గల్ఫ్ ఎయిర్. అలాగే గల్ఫ్ ఎయిర్‌లైన్, కంప్యూటర్ న్యూజ్ మీడియా ఈస్ట్ సిఐఓ 100 అవార్డ్స్‌ని నాలుగోసారి వరుసగా అందుకుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







