'తలాక్' విధానం అభ్యంతరకరం
- September 10, 2016
ముస్లింలు విడాకులివ్వడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఉపాధ్యక్షుడు మౌలానా కల్బే సాధికి వ్యతిరేకించారు. మూడుసార్లు తలాక్ చెప్పి, విడాకులు ఇవ్వడం గురించి ఆయన మాట్లాడుతూ విడాకులు తీసుకోవాలని స్త్రీ, పురుషులిద్దరూ నిర్ణయించుకునే వరకు చర్య తీసుకోకూడదన్నారు. హిందుత్వం మాదిరిగానే తమకు కూడా అనేక నిబంధనలు ఉన్నాయన్నారు. భర్త మూడు లక్షలసార్లు తలాక్ అని చెప్పినప్పటికీ చెల్లుబాటు కాకుండాపోయే అవకాశం కూడా ఉందన్నారు. విడాకులు, భార్యను పోషించడం వంటి వివాహ సంబంధ విషయాల్లో ముస్లిం మహిళలకు ఉన్న హక్కులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 2న ఆలిండియా పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయాలను తెలిపింది. బహుభార్యత్వాన్ని, ట్రిపుల్ తలాక్‌ను సమర్థించింది. ఈ అంశాలు తమ మతానికి సంబంధించినవి కనుక న్యాయస్థానాలకు అధికార పరిథి లేదని పేర్కొంది. తమ మతానికి ఖురాన్, షరియా చట్టం ఆధారమని తెలిపింది.
మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని నిషేధించాలని ఆలిండియా ముస్లిం వుమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు శైష్ట అంబర్ డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







