విదేశీ ఉగ్రవాదులు హతం : కశ్మీర్
- September 11, 2016
ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్ సెక్టర్లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు సరిహద్దుల మీదుగా చొరబడేందుకు ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా కనుగొనేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.ఇంకోవైపు కశ్మీర్ లోయలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







