సగ్గుబియ్యం రైతా
- August 05, 2015
సగ్గుబియ్యం రైతా
కావలిసిన పదార్ధాలు
సగ్గుబియ్యం - 2 కప్పులు
వేయించిన వేరుశెనగపప్పు - అరకప్పు
తాజా పెరుగు - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని ముందు రోజు నానబెట్టి, మరుసటి రోజు ఉడికించి వడపోయాలి. వడిపోసిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో వేయించిన వేరు శెనగపప్పు, పెరుగు, కొత్తిమీర, ఇంగువా, ఉప్పు వేసి ఉండలు లేకుండా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు బాణలిలో జీలకర్ర, కొద్దిగా ఇంగువా, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, సగ్గుబియ్యం మిశ్రమంలో కలపి అరగంట సేపు మూత పెట్టేయాలి. అంతే సగ్గుబియ్యం రైతా రెడీ. ఇది స్నాక్ ఐటంలా తినొచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు రోటీతో తినొచ్చు. లేదా బిరియానీతో కూడా తినొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







