రామ్ చరణ్ సినిమా ధృవ లో అల్లు అర్జున్..
- September 12, 2016
మణిరత్నం భారత దేశంలో దర్శక దిగ్గజం... తాను తెరకెక్కించే సినిమాలతో సమాజంలో ప్రతిబింబిస్తున్న సమస్యలను చూపిస్తూ.. వాటిని అందమైన ప్రేమ కథా చిత్రాలుగా తీర్చిదిద్దడంలో నేర్పరి.. మౌన రాగం, రోజా, ముంబై, నాయకుడు, సఖి.. వంటి అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం తెలుగులో గీతాంజలి సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకొన్నాడు. ఇటీవల మనిరత్నం తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. కానీ ఇప్పటికీ మణిరత్నం సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తగ్గలేదు.. ఎంతటి స్టార్ హీరో అయినా.. తమకు ఒక్కసారైనా మణిరత్నం సినిమాలో నటించాలనే కోరిక తెలియజేస్తూనే ఉన్నారు.. తాజాగా మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ ఇద్దరు మెగా హీరోలు దక్కించుకొన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
రామ్ చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా స్ర్కీన్ పంచుకొనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. మణిరత్నం దర్శకత్వంలో ఇద్దరు మెగా హీరోలు ఒకే స్క్రీన్ పై అంటే ఆ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఈ బావాబావమరుదులు ఇద్దరు ఎవడే సినిమాతో సందడి చేశారు.. ఇక రామ్ చరణ్ తాజా సినిమా ధృవ లో అల్లు అర్జున్ కూడా నటిస్తాడనే వార్తలు వెలువడుతున్న నేపద్యంలో మణిరత్నం సినిమా హ్యాట్రిక్ కాంబో అవుతుంది. కాగా ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడల్సి ఉంది.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







