పారా ఒలింపిక్స్‌లో బహ్రెయిన్‌కి తొలి గోల్డ్‌ మెడల్‌

- September 12, 2016 , by Maagulf
పారా ఒలింపిక్స్‌లో బహ్రెయిన్‌కి తొలి గోల్డ్‌ మెడల్‌

మనామా: 2016 రియో పారా ఒలింపిక్‌ గేమ్స్‌లో బహ్రెయిన్‌కి తొలి గోల్డ్‌ మెడల్‌ అభించింది. షాట్‌పుట్‌ కాంపిటీషన్‌లో బహ్రెయిన్‌కి చెందిన ఫాతిమా అబ్దుల్‌ రజాక్‌ గోల్డ్‌ మెడల్‌ని కైవసం చేసుకుంది. 4.76 మీటర్ల రికార్డ్‌ సాధించింది ఫాతిమా. భారత్‌కి చెందిన దీపా మాలిక్‌, గ్రీక్‌కి చెందిన డిమిత్రా కోరకిడాతో తలపడ్డ ఫాతిమా మొదటి స్థానాన్ని గెల్చుకుంది. దీపా మాలిక్‌కి ఈ విభాగంలో రజత పతకం లభించింది. బహ్రెయిన్‌ డిజేబుల్డ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ దుయైజ్‌ అల్‌ ఖలీఫా, ఈ మెడల్‌ని కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాతోపాటు ్పఐమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, డిప్యూటీ సుప్రీం కమాండర్‌ అండ్‌ ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా, తదరులకు అంకితం చేశారు. షేక్‌ మొహమ్మద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈద్‌ అల్‌ అదా సందర్భంగా బహ్రెయిన్‌ ఈ ఘనతను సాధించడం అద్భుతమని కొనియాడారు. రియో 2016 పారా ఒలింపిక్‌ గేమ్స్‌లో 170 దేశాలకు చెందిన 4,500 మంది క్రీడాకారులు 32 ఈవెంట్లలో 526 మెడల్స్‌ కోసం పోటీ పడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com