దుబాయ్ లో తెలుగు సినీ తారల సందడి

- August 06, 2015 , by Maagulf
దుబాయ్ లో తెలుగు సినీ తారల సందడి

తెలుగు సినీ తారలు దుబాయ్ లో 'సైమా'(సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కి విచ్చేసారు.దక్షిణాది తారలంతా ఒకే వేదిక మీద చేసుకునే సందడి ఇది. ఆట పాటలతో ఇక్కడి దక్షిణాది ప్రజలను అలరించనున్నారు.'దుబాయ్ వరల్డ్ సెంటర్' లో నాలుగో సారి ఈ అవార్డ్ల పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిరవహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.గురువారము తెలుగు మరియు కన్నడ అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది. శుఖ్రవారము తమిళం మరియు మలయాళం అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమములో తెలుగు,కన్నడ,తమిళ,మలయాళం సినీ పరిశ్రమలకు చెందినా తారలు పాల్గొంటారు.ప్రముఖ కధానాయకుడు రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలతో అందరిని అలరించనున్నారు.శ్రుతి హస్సన్,శ్రియ తాపసి,ఆదాశర్మ,పూజ హెగ్డే,షర్మిలా వీళ్ళంతా ఆటపాటలతో అందరిని అలరించునున్నారు. తెలుగువారి లో ఇప్పటికే బాలకృష్ణ,నాగ చైతన్య,అల్లు అర్జున్,రవి పనస(ఆర్.కె మీడియా అధినేత) విచ్చేసి ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో మీడియాయందు తమకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న 'ఆర్.కె మీడియా' వారు గత నాలుగు సంవత్సరాలుగా సైమాకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com