బట్టబయలైన దొంగతనం

- August 06, 2015 , by Maagulf
బట్టబయలైన దొంగతనం

ఒక ఊరిలో గంగయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచి వాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవును చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎంతో శ్రద్దగా దానికి మేత, కుడితి పెడుతూ ఉండేవాడు. అంతే కాకుండా దాన్ని దైవంగా భావించి ప్రతి శుక్రవారం శుభ్రంగా స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో పూజలు కూడా చేసేవాడు. కొన్నాళ్లకు ఆ ఆవు ఒక దూడను కన్నది. ఆ ఆవును,దూడను కూడా ఎంతో బాగా చూసుకునేవాడు. దాంతో అతనికి పాల దిగుబడి పెరిగి, ఆదాయం కూడా బాగా పెరిగింది. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఆవును ఎవరో దొంగిలించుకుపోయారు. దాంతో గంగయ్య చాలా బాధపడ్డాడు. దూడ కూడా బెంగపడి ఏమీ తినేది కాదు. దాంతో గంగయ్య ఒక ఉపాయం ఆలోచించి, తన ఆవును తెచ్చి ఇచ్చిన వారికి దూడను కూడా బహుమతిగా ఇస్తానని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన ఆ ఊరి కిరాణా షాపు యజమాని గోపయ్య, తన దొడ్లో కట్టి పారేసిన ఆవును తీసుకొచ్చి గంగయ్య ముందు పెట్టి ఎంతో కష్టపడి నీ ఆవును వెతికి తీసుకొచ్చాను. నువ్వు చెప్పినట్లే నీ దూడను కూడా ఇచ్చి పంపించు అన్నాడు. అంతలో తన దూడను, యజమానిని గుర్తు పట్టిన ఆవు తన కాలితో గోపయ్య ఒక్క తన్ను తన్ని గంగయ్య దగ్గరికి వచ్చేసింది. గంగయ్య కిటుకు తెల్సుకోకుండా అమాయకంగా వచ్చి తన తప్పు తానే బయట పెట్టుకున్న గోపయ్య, గంగయ్యను క్షమించమని అడిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. గంగయ్య తన ఆవు దొరికినందుకు సంతోషించి, గోపయ్యను ఏమీ అనకుండా వదిలిపెట్టాడు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com