సౌదీ లో ఆత్మాహుతి దాడి
- August 06, 2015
సౌదీ అరేబియాలో గురువారం ఓ మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది మృతిచెందారు. వీరిలో 10 మంది పోలీసులు, ముగ్గురు మసీదు కార్మికులున్నారు. అసిర్ రాజధాని అభాలో ఉన్న మసీదులో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 17 మంది పోలీసులు మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చినా.. మొత్తం గా13 మంది మృత్యువాత పడినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. గత మే నెల నుంచి ఇప్పటివరకూ చూస్తే సౌదీలో ఇది మూడో ఆత్మాహుతి దాడి. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







