డ్రైఫ్రూట్స్ పలావ్
- August 06, 2015
డ్రైఫ్రూట్స్ పలావ్
కావలిసిన పదార్ధాలు
బాస్మతి రైస్ - కప్పు
జాజికాయ పొడి - చెంచా
వేయించిన ఉల్లిపాయ ముక్కలు - కొన్ని
వేయించిన పచ్చిమిర్చి ముక్కలు - కొన్ని
యాలకులు, లవంగాలు - మూడేసి చొప్పుున
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జీలకర్ర, వాము - అరచెంచా చొప్పున
నెయ్యిలేదానూనె - తగినంత
ఉప్పు - తగినంత
కారం - అరచెంచా
పన్నీర్ ముక్కలు వేయించినవి - అరకప్పు
జీడిపప్పు, బాదం, కిస్మిస్ - కొన్ని
చక్కెర - కొద్దిగా
తయారీ
బాణలిలో చెంచా నెయ్యి వేడి చేసి ఇరవై నిముషాల ముందు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని వేసి వేయించాలి. తరువాత దానిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి జాజికాయ పొడీ, తగినంత ఉప్పు వేసి కొంచెం పొడి పొడిగా ఉండేలా ఉడికించుకోవాలి. తరువాత మరో బాణలిలో మరి కొంచెం నెయ్యి వేసి దానిలో పనీర్ ముక్కలు వేసి వేయించాలి. తరువాత జీలకర్రా, వామూ, దాల్చినచెక్కా, యాలకులూ, లవంగాలూ, మిరియాలూ, చక్కెరా వేసేయాలి. మసాలా పదార్ధాలు అన్నీ వేగాక బాదం, కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి దాని మీద కారం చల్లి నెమ్మదిగా కలపాలి. అన్నం కూడా బాగా వేగినాక పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేస్తే డ్రైఫ్రూట్స్ పులావ్ రెడీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







