తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటుకు ఏ.పి ప్రభుత్వం నిర్ణయం
- September 14, 2016
దశాబ్దాలుగా తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏమి చేయడం లేదనే అపప్రద తెలుగు జనాల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా ఏపీలో ఈ తరహా పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లుంది ఏపీ సర్కార్. తాజాగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ.
తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు తెలుగులోనే ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్, నాగులపల్లి శ్రీకాంత్, జీవీ రామకృష్ణారావు, విజయభాస్కర్ లు సభ్యులుగా ఉండనున్నారు.
ఇకనుంచి ఏపీలోని దుకాణాల పేర్లు కూడా తెలుగులోనే ఏర్పాటు చేయాలన్న నిబంధనను తాజా ఉత్తర్వుల ద్వారా ప్రకటించింది ప్రభుత్వం. శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







