ఉత్తర తెలంగాణలో స్మగ్లర్లగా వ్యవహరిస్తున్న'గల్ఫ్ ఏజెంట్లు'
- September 14, 2016
ఉత్తర తెలంగాణలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. ఏకంగా సౌదీ దేశాలకు అక్రమంగా నిషేధిత మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో డ్రగ్స్ కి ఫుల్ డిమాండ్ ఉండటంతో కొందరు ఏజెంట్లు స్మగ్లర్ల అవతారమెత్తుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ కి వెళ్తున్న అమాయకులను బలిపశువులను చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. గల్ఫ్ ఏజెంట్లు స్మగ్లర్ల అవతారమెత్తి అమాయకులతో నిషేదిత మత్తుపదార్థాలు, ఔషధాలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తున్నారు. సౌదీ దేశాలకు వెళ్లొచ్చేవాళ్ల వివరాలు సేకరించి వారితో మందులు ప్యాక్ చేసిన కవర్ ను పంపిస్తారు. అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని చెప్తారు. కవర్ తెచ్చిన వారికి 5నుంచి 10వేల వరకు డబ్బులు చెల్లిస్తారు. అయితే అందులో నిషేదిత మందులు ఉన్న విషయాన్ని తెలియని అమాయకులు పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 13మంది ఆమాయకులు డ్రక్స్ మాఫియాకు బలయ్యారు. రెండేళ్ల క్రితం కోరుట్ల మండలానికి చెందిన నరేష్..ఇలానే ఎయిర్ పోర్టులో పట్టుబడి జైలుపాలయ్యాడు. జగిత్యాల సమీపంలోని చిత్తం పేట్‌కు చెందిన మరో యువకుడు 20ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. తాజాగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడ్పకల్‌కు చెందిన పూజారి శ్రీనివాస్ అనే యువకుడు డ్రగ్స్ మాఫియాలో చిక్కుకున్నాడు. గత ఆరేళ్లుగా దుబాయిలో ఉంటున్న శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం స్వదేశం వచ్చాడు. పెళ్లి చేసుకొని ఈ నెల నాలుగున దుబాయి వెళ్లాడు. అయితే మోర్తాడ్ మండలం ఒడ్యాట్‌కు చెందిన మహేష్ ఆనే ట్రావెల్ ఏజేంట్..తమ బంధువులు అనారోగ్యంగా ఉన్నారని మందుల ప్యాకేట్‌ను శ్రీనివాస్ ద్వారా పంపించాడు. మందుల ప్యాకెట్ తీసుకెళ్లిన శ్రీనివాస్ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డాడు. తన భర్తను జైలు పాలుచేసిన ఏజెంట్ మహేష్‌ను కఠినంగా శిక్షించాలని బాధితుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ రాకేట్‌లో 16మంది ఏజేంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రాథమికంగా పోలీసుల విచారణలో వెల్లడైనప్పటికి ఇప్పటి వరకు ఒక్క కేసుకూడా నమోదుకాలేదు. రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా అక్రమ సంపాదనకు ఎగబడిన ఏజేంట్లు ఈ డ్రగ్స్ మాఫియాలో ఆమాయకులను పావులుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వం లోతుగా విచారణ జరిపి డ్రగ్స్ స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









