ప్రపంచంలో ఎత్తయిన వంతెన నిర్మాణం పూర్తి చేసిన చైనా
- September 14, 2016
చైనా అంటేనే కట్టడాలకు ప్రసిద్ధి. రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనే మహాకుడ్యాన్ని నిర్మించి సత్తాచాటారు చైనీయులు. ఇప్పటికీ నిర్మాణ రంగంలో వారిదే అగ్రపీఠం అనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇప్పుడు అది నిర్మిస్తున్న బైపన్ జియాంగ్ బ్రిడ్జి వాటన్నిటిని మించిపోయింది.
చైనా నిర్మిస్తున్న ఈ వంతెన మరో భూలోక వింతలా అనిపిస్తొంది. భూమి..ఆకాశాలను కలిపే వారధిగా కనిపిస్తోంది. ఎత్తయిన వంతెనలకు చిరునామాగా మారిన చైనా చేస్తున్న మరో ప్రయోగం ఈ వంతెన నిర్మాణం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ వంతెన నిర్మాణాన్ని చైనా శరవేగంగా పూర్తిచేస్తోంది. నదీ మట్టానికి 565 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ రంగంలోని చైనాను మించిన వారు లేరని పేరుగాంచింది. ప్రపంచంలోని పది ఎత్తయిన వంతెనల్లో 8 చైనాలోనే ఉన్నాయి. దక్షిణ చైనాలోని బైపన్ నదిపై 1854 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న బైపన్జియాంగ్ వంతెన ప్రాథమిక నిర్మాణం పూర్తయింది. నది రెండువైపుల ప్రాంతాన్ని కలుపుతూ వారధి తయారైంది. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేనున్నారు. వంతెనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎత్తులోనే కాదు పొడవులోనూ దీనిది అగ్రస్థానమే. బైపన్జియాంగ్ మొత్తం పొడవు 4,399.6 అడుగులు. ఈ వంతెన రెండు రాష్ట్రాలను కలుపుతుంది. దాని వల్ల మూడు గంటల ప్రయాణం తగ్గుతుంది. ఇక దీని నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. 1000 మంది ఇంజనీర్లు పనిచేశారు. వోగ400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన వంతెనలు మొత్తం 3 ఉండగా మూడూ చైనాలోనే ఉండడం విశేషం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎత్తయిన 15 వారధుల్లో 14 చైనాలోనే నిర్మితమవుతున్నాయి. 1056 అడుగుల ఎత్తున జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన ఒక్కటే చైనా వారధులతో పోటీపడుతోంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









