ఘర్షణలకు పాల్పడడం సిగ్గుచేటు : కమల్
- September 14, 2016
కావేరీ నదీ జలాల కోసం కర్ణాటక - తమిళనాడుల మధ్య చెలరేగిన ఘర్షణ, జరిగిన నష్టం పట్ల విలక్షణ నటుడు కమల్ హాసన స్పందించారు. నదీ జలాల కోసం ఘర్షణ పడడం సిగ్గుచేటని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కమల్ హాసన్... "భాష తెలియని వానరాలుగా మనం ఉన్నప్పుడూ.. కావేరీ ప్రవహించింది.. మానవుడిగా మారి నాగరికత నేర్చుకున్న తర్వాత కూడా ప్రవహిస్తూనే ఉంది.. మనతరం ముగిసినాక కూడా అది అలానే ప్రవహిస్తుంది.. జరిగిన చరిత్రను ఆ నది చెబుతుంటే మనం మాత్రం ఘర్షణలకు పాల్పడడం సిగ్గుచేటు" అని ఘాటైన పదాలతో వ్యాఖ్యానించారు.కాగా ఉద్యమం ఎలా చేయాలో భావి తరాలకు నేర్పుదాం.. అందుకోసం శాంతియుతంగా పోరాడుదాం.. మీ బాదను - కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను..ఇకనైనా అల్లర్లకు స్వస్థి పలుకుదాం అని ఆందోళనకారులకు ప్రకాష్ రాజ్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో జరిగిన - కొనసాగుతున్న విధ్వంసం చూస్తుంటే చాలా బాధగా ఉందని - హక్కుల కోసం పోరాడటంతో తప్పేమీ లేదు కానీ.. దానికి ఎంచుకున్న మార్గం ఇది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హక్కుల కోసం పోరాటాన్ని తప్పుపట్టడంలేదు కానీ..దానికోసం ఆస్తులు ధ్వంసం చేసుకోవడం - ఒకరినొకరు కొట్టుకోవడం తప్పు అని ప్రకాష్ రాజ్ అన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







