నిమజ్జన కోలాహలంతో హుస్సేన్‌సాగర్..

- September 14, 2016 , by Maagulf
నిమజ్జన కోలాహలంతో హుస్సేన్‌సాగర్..

హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనం కోలాహలం ఊపందుకుంటోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిమజ్జనంలో అందరూ పాల్గొంటున్నారు. రెండు రోజుల నుంచి నిమజ్జనాలు జరుగుతుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈఏడాది ఖైరతాబాద్ గణేశుడు మొదటగా నిమజ్జనం అవుతుండటంతో పోలీసులు అందుకోసం రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు. మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగుగంటల్లో విగ్రహం ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహం ఎన్టీఆర్‌మార్గ్‌ మీదకు వచ్చిన వెంటనే సాధ్యమైనంత తొందరగా నిమజ్జనం జరిగేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు హుస్సేన్‌సాగర్ లేక్‌ను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com