పర్యాటకులతో వెళ్తున్న బోటులోపేలుడు: విదేశీ పర్యాటకురాలు మృతి
- September 15, 2016
ఇండోనేషియాలోని బాలి ద్వీపం సమీపంలో విదేశీ పర్యాటకులతో వెళ్తున్న బోటులో గురువారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఇండేనేషియా పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 35 మంది విదేశీయులు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. వీరంతా పోర్చుగల్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బ్రిటన్ దేశాలకు చెందిన వారని తమ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. అలాగే నలుగురు బోటు సిబ్బంది కూడా ఉన్నారన్నారు. గురువారం ఉదయం పశ్చిమ బాలిలోని పడంగ్ బాయి పోర్టు నుంచి బోటు బయలుదేరిన ఐదు నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.అయితే పేలుడు ఇంజన్ ప్రాంతంలో నుంచి వచ్చిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







