రజనీకాంత్ మధ్యవర్తిత్వం ...
- September 15, 2016
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రగిలిన కావేరి జలాల చిచ్చు ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అల్లరి మూకలపై చర్యలు తీసుకోవడంతో క్రమంగా ఈ వివాదం సద్దుమణుగుతోంది. అయినా ఏదో ఓ చోట అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుండడంతో కేంద్రం కూడా బలగాలను రంగంలోకి దింపింది. అయితే ఈ అల్లర్ల వెనక పాకిస్థాన్ ప్రమేయం ఉందని, కొందరు, గ్యాంగ్ స్టర్స్ డబ్బులు ఇచ్చి మరీ యువతను రెచ్చగొట్టారని కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయి. దీంతో కావేరి జల వివాదం కొత్త మలుపు తిరిగింది.కావేరి జలాల విషయంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.ఈ వివాదాన్ని మరింత రాజేయద్దని వారికి సూచించారు. మరోవైపు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పలువురు సినీ స్టార్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఆవేశాలకు పోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రానున్నారని తెలుస్తోంది.తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీ కలగజేసుకుని ఇరు రాష్ట్రాల ప్రజలకు ఆవేశాలకు పోవద్దని సూచించాని విజ్ఞప్తి చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన తారలు చేపట్టిన ధర్నా కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని చెప్పిన ఈమె ఇరు రాష్ట్రాలకు రజనీకాంత్ కావాల్సిన వారని నష్టపోయిన తమిళనాడుకు మద్దతుగా ఆయన గళం విప్పాలని కోరారు.కర్ణాటకలో తమిళులపై జరిగిన దాడిని నిరసిస్తూ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో బీజేపీ ఆందోళన చేపట్టిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. లక్షలాదిమంది తమిళులు కన్నడిగుల వేధింపులను తట్టుకోలేక సొంత ఊళ్లకు తిరుగుముఖం పడుతున్నారన్నారు.. కర్ణాటకలో తమిళులను వెతికి వెతికి ఐడీ కార్డులు చూసి నిర్ధారించుకుని మరీ కన్నడిగులు దాడులు జరుపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తమిళనాడులో కన్నడ ప్రజలకు సంస్థలకు తమ ప్రభుత్వం భద్రత కల్పిస్తే.. ఇందుకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. రజనీకాంత్ మధ్యవర్తిత్వం చేసినప్పటికీ సమస్య కొలిక్కిరాని పక్షంలో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని సౌందర రాజన్ కోరారు. మరి ఈమె విజ్ఞప్తిని రజనీకాంత్ స్వీకరిస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







