శివాని నాగ శౌర్య తో రొమాన్స్ ....

- September 15, 2016 , by Maagulf
శివాని నాగ శౌర్య తో రొమాన్స్ ....

ఎప్పటినుంచో రాజశేఖర్ జీవితల కుమార్తె శివాని వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ అనే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ ఏ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా జీవితం కుమార్తె శివాని ఓ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నాగ శౌర్య హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నారు. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు, కొత్త తరహా కథ, కథనాలు ఉంటాయట.. కాగా 22 ఏళ్ల శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సమయం అని భావించిన రాజశేఖర్, జీవిత లు ఈ సినిమాలో నాగ శౌర్య పక్కన నటించడానికి అంగీకరించారాట. దీంతో మరో హీరో కుమార్తె తెలుగు తెరపై సందడి చెయ్యడానికి ముందుకు వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com