ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు....!
- September 15, 2016
ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు చురుగ్గా భాగస్వాములవుతున్నారు. మెల్బోర్న్కు శివారులో ఉన్న విటిల్సీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ముగ్గురు పంజాబీ ఆస్ట్రేలియన్లు పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు భారతీయులు గెలవలేదు. అయినప్పటికీ గత చరిత్రతో సంబంధం లేకుండా లఖ్వీందర్ సింగ్ ధిల్లాన్, గురీందర్ కౌర్, జుడగేబిర్ సింగ్ బరిలో నిలిచారు. ఈ నగరం జనాభా 1,54,900. వీరిలో ఇంగ్లిష్, మేసిడోనియన్లు, ఇటాలియన్లు, గ్రీకులు, భారతీయులు ఉన్నారు. ఈ జోన్లో ఉన్న దాదాపు 40 వేల మంది ఓటర్లు నలుగురు కౌన్సిలర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రిఫరెన్స్ ఓటింగ్ సిస్టమ్ద్వారా వచ్చే నెల 21న ఎన్నికల జరుగుతాయి.అమృత్సర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిన ధిల్లాన్ ఓ ట్యాక్సీ డ్రైవర్. తన క్యాబ్‌లో ప్రయాణికుడు మర్చిపోయిన 1.10 లక్షల డాలర్లను తిరిగి ఇచ్చేయడంతో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. నిజాయితీగా వ్యవహరించినందుకు ఆయనను మెల్బోర్న్ సిటీ కౌన్సిల్ సత్కరించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న కౌర్ కూడా అమృత్సర్ నుంచి వెళ్ళినవారే.ఆమె బాప్టిజమ్ స్వీకరించారు. స్వచ్ఛంద సేవ చేస్తూ ఉంటారు. సింగ్ పంజాబ్‌లోని అబోహర్ ప్రాంతం నుంచి మెల్బోర్న్ వెళ్ళారు. ఆయన వ్యాపారవేత్త, స్వచ్ఛంద సేవకుడు.ఓటర్ల మద్దతు కోరడం కోసం వీరు ముగ్గురూ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంతో పాటు ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







