కర్ణాటకలో ఘోరం ...
- September 15, 2016
కావేరీ జలాల వివాదంతో హుమ్నాబాద్ ప్రాంతంలో ఆందోళనకారులు ఒక వోల్వో బస్సుకు నిప్పు పెట్టారు. దాంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. బస్సులో మరికొంతమంది ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా సమాచారం అందలేదు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 11 మందికి తీవ్రగాయాలు కాగా, పాటిల్ అనే ఒక అదనపు ఎస్పీ మరణించారని అంటున్నారు. ఒక లారీ, ఈ బస్సు ఢీకొన్నాయని, అందువల్ల బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం సంభవించిందని కర్ణాటక పోలీసులు చెబుతుండగా.. ప్రయాణికులు మాత్రం ఆందోళనకారులే నిప్పుపెట్టారని అంటున్నారు.బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
కావేరీ జలాల వివాదం సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తుండటంతో ఆ ప్రభావం కర్ణాటక మీద కూడా పడింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం కనపడితే చాలు.. ఆందోళనకారులు వాటిని తగలబెట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా ''టీఎన్'' అనుకుని ''టీఎస్'' రిజిస్ట్రేషన్ ఉన్న బస్సుకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







