ప్రభుత్వ ఫోరం వెబ్ సైట్ ప్రారంభం

- September 16, 2016 , by Maagulf
ప్రభుత్వ ఫోరం వెబ్ సైట్ ప్రారంభం

మనామా : ప్రభుత్వ ఫోరం 2016 యొక్క వెబ్సైట్  " www.GovernmentForum.bh  " అధికారికంగా ప్రారంభించబడింది.

ప్రధాని శ్రీ శ్రీ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఇది లాంఛనంగా మొదలుకానుంది .ఈ కార్యక్రమానికి  క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి శ్రీ శ్రీ  ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు ఫోరమ్  ఈ నెల ( సెప్టెంబర్ ) 18 వ తేదీ  2016 నుంచి ఇసా కల్చరల్ సెంటర్ లో  ప్రారంభంకానుంది.రాజ్యంలో ఈ తరహా విధానంలో తొలి ఫోరం కాగా, ప్రభుత్వంలో భాగస్వామ్యులైన  మంత్రులు, అధికారుల విధానపరమైన చర్యలు వారు ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలు మరియు ఆర్ధిక శ్రేయస్సు పంపిణీ తదితర మార్గాలని  వెబ్ సైట్ సహాయంతో  అన్వేషించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బహరేన్ ఇన్ఫర్మేషన్ &  ఇ - గవర్నమెంట్  అథారిటీ ( ఐ జి ఎ ) సి ఇ మహమ్మద్ ఆలీ అలఖ్ఎడ్  ప్రభుత్వం ఫోరం వెబ్సైట్ స్థాపనలో ఓ ముఖ్యమైన ప్రయోజనం ఉందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com