దుస్తులు మార్చుకొంటున్న ఇంటి ఓనరమ్మనే వీడియో తీసిన ప్రబుద్ధులు
- September 16, 2016
మనామా : తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు ... అద్దెకు ఉన్న ఇంటి ఓనరమ్మనే వీడియోలలో చిత్రీకరించారు పక్క గదిలో ఉంటూ ..పక్కలో బల్లెమయ్యారు..వయోబేధం మరచి తమ వికృత చేష్టలతో ఆమెకు విసుగు తెప్పించారు.. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఇరువురు వ్యక్తులు.. అద్దెకు ఇచ్చిన పాపానికి పక్క పోర్షన్ లో ఒకే కప్పు కింద నివసిస్తూ, ఐదు పదులు నిండిన ఆ ఇంటి ఓనరమ్మ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.దుస్తులు మార్చుకొంటున్న సమయంలో ఆ మహిళని రహస్యంగా వీడియో రికార్డింగ్ తీస్తూ ఆమెకు ఒకరోజు అడ్డంగా దొరికిపోయారు. దీనితో వళ్ళు మండిన ఆమె వీరి పైశాచిక చేష్టలని వివరిస్తూ పోలీసులకు పిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు గంటల వ్యవధిలో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపు లోనికి తీసుకొన్నారు.కాగా, వీరంతా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నఆసియా దేశాలకు చెందిన వారు కావడం విశేషం. కోర్టు నమోదు చేసిన వివరాల ప్రకారం, ఈ సంఘటన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. మనామా లోని ఒక ఆసియా మహిళ ముద్దాయిలకు తన ఇంటి గదులను కిరాయికి ఇచ్చింది. వీరు పక్క పోర్షన్ లో ఉండి... పాడు పనులు చేస్తున్నారు. ఇది ఎరగని ఆమె తన పోర్షన్ లో దుస్తులు మార్చుకొంటుంది. అదే సమయంలో పక్క వాటాలో అద్దెకు ఉంటున్న ఆ ఆసియా వ్యక్తులు అప్రమత్తమై పోతూ.. ఆ మహిళ (50)ని తలుపు సందుల్లోంచి రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. ఒక రోజు దుస్తులు మార్చుకొంటున్న వేళ శబ్దాలు రావడంతో తలుపు వైపు చూసిన ఆమెకు తన పట్ల వారు చేస్తున్నదుశ్చర్య తెల్సింది. దాంతో గగ్గోలు పెడుతూ పక్క పోర్షన్లోనికి వచ్చి వీరిని నేరుగా పట్టుకున్నట్లు ఆమె కోర్టుకి తెలిపింది. తన యాభై పదులు నిండిన వయస్సులోనూ తనకూ ఈ తరహా వేధింపులు తప్పలేదని న్యాయస్థానం ఎదుట ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలోనూ వారు ఇదే తరహా లో తాను దుస్తులు మార్చుకొంటుంటే , వీడియో చిత్రీకరణ చేశారని...పోనీలేమ్మని సర్దుకుపోతే, మరల మరల అదే పని వారు పునరావృతం చేస్తున్నారని తెలిపారు. మరోసారి కనుక వాళ్ళు అదేవిధంగా ప్రవర్తిస్తే, పోలీసులకు పిర్యాదు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







