రావోయి అతిథి ...
- September 16, 2016
అక్కడ జాలువారే జలపాతాలు... పూలజల్లులా కురిసే వానచినుకులు .. తెరలు తెరలుగా కమ్ముకునే పొగమంచు అందాలు మనసుని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇటు కృష్ణ, గోదావరి నదుల మధ్య పచ్చదనాన్ని పరుచుకుని నేలతల్లికి చీరకట్టిన కోనసీమ సోయగాలు మనసుల్ని మైమరిపిస్తాయి. కేవలం ఇవే కాదు. నవ్యాంధ్రలో పర్యాటకానికి మరింత సొగసులు అద్దేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది.
రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. సింగపూర్, శ్రీలంక, మలేసియా తరహాలో ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సంస్కృతి, పురావస్తు, వారసత్వ సంపద, పర్యాటకం, ఆహారం, ఆతిధ్యం తదితర శాఖలను అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతోపాటు టూరిజంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. దేశంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఈ తరహా పర్యాటక బోర్డులను ఏర్పాటుచేశారని, ఏపీలోనూ ఇప్పుడున్న వ్యవస్థ స్థానంలో బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రణాళికల్ని వెంటనే అమలుచేయడం, సామర్ధ్యం పెంపు, నైపుణ్యాల మెరుగుదల, జవాబుదారీతనం, మార్కెట్ క్రెడిబులిటీ, బ్రాండింగ్ తదితర ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపీటీడీసీ స్థానంలో స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా పనిచేసే బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అటు జిల్లా , నగర స్థాయిలోనూ టూరిజం కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. రాజమండ్రి, అమరావతి, తిరుపతి, విశాఖ నగరాలలో సిటీ టూరిజం కౌన్సిల్స్‌ను ఏర్పాటుచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. భవానీద్వీపం, అఖండ గోదావరిలోని ద్వీపాలలో పర్యటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఐఎన్ఎస్ విరాట్ రాకతో రాష్ట్ర పర్యాటకరంగం ఊపందుకుంటుందన్న ఆశాభావాన్ని సిఎం వ్యక్తంచేశారు. టూరు ఆపరేటర్లకు నిరంతర శిక్షణ ఇస్తుండాలని, ఎక్కడ నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తెరిగి తగిన శిక్షణ ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం గల అంశంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి తిరుగులేదని, ఆధ్యాత్మిక రంగంతో సమానంగా మిగిలిన విభాగాల్లో పర్యాటక శోభకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులను ఏడాది వ్యవధిలోగా పూర్తిచేయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







