పాఠశాలలు ఆదివారం నుంచి ప్రారంభం..మొదలు కానున్న ఇక్కట్లు

- September 17, 2016 , by Maagulf
పాఠశాలలు ఆదివారం నుంచి ప్రారంభం..మొదలు కానున్న ఇక్కట్లు

వేసవి సెలవులు తరువాత అత్యధిక పాఠశాలలు ఆదివారం నుంచి ( రేపు ) తిరిగి ప్రారంభమవడం మరో వైపు  ప్రభుత్వ కార్యాలయాలు ఈద్ అల్ అధా విరామం తర్వాత మొదలు కావడంతో  ట్రాఫిక్  స్థంబనకు కారణం కానుంది. కతర్ నివాసితులు ఈ పరిస్థితుల దృష్ట్యా తమ ఇళ్ళ వద్ద నుంచి గమ్య స్థానాలకు త్వరితగతిన ప్రయాణ మవ్వాలని తద్వారా సురక్షిత డ్రైవింగ్ చేస్తూ వారి లక్ష్యంని చేరుకోవచ్చని ట్రాఫిక్ భద్రత అధికారి సూచించారు. భారీ ట్రాఫిక్ కతర్ అంతటా ముఖ్య ప్రాంతాల్లో ఉంటుందని భావిస్తున్నారు. 3 లక్షల మంది  కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులకు హాజరు కావొచ్చని అంచనా వేస్తున్నారు. పలు పాఠశాలలకు చెందిన అనేక బస్సులు ఈ మార్గాలలో ప్రయాణం చేయాల్సి ఉంది.  ప్రైవేట్ కార్లు మరియు పడవ లాంటి కార్లు (  లిమౌసిన్స్ ) లతో ట్రాఫిక్ రద్దీ రెట్టింపు కానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com