సౌదీ అరేబియా లో ఇద్దరు పోలీసులు కాల్చివేత
- September 18, 2016
శనివారం రాత్రి పొద్దుపోయాక సౌదీ అరేబియా యొక్క తూర్పు ప్రాంతం లో ప్రధాన నగరం దమ్మం ప్రాంతంలో ఇద్దరు సౌదీ పోలీసులను కాల్చి చంపేరు. గుర్తు తెలియని ఆగంతకులు చీఫ్ సార్జెంట్ ముసా ఆలీ మొహమ్మద్ అల్ ఖ్ఓబి మరియు సైనికుడు నావాఫ్ మహ్మాస్ అల్ ఓటైబి లను చంపిన తర్వాత అక్కడినుంచి పారిపోయినట్లు స్థానిక అధికారులు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఒక ప్రకటనలో తెలిపారు.
దాహరన్ అల్ జుబెయిల్ రహదారికి దగ్గరలో ఉన్న ఖాద్రియ ప్రాంతం కార్లు రిపేర్లు చేసుకొనేందుకు అక్కడ ఉన్న అనేక గ్యారేజీలు ప్రసిద్ధి. ఆ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల మీదకు ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపేరు. పోలీసుల మృతదేహాలను డమ్మామ్ సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పరిశోధన నిర్వహించనున్నారు. మరణించిన పోలీసులతో ఒకరైన అల్ ఖ్ఓబి సోదరుడు మాట్లాడుతూ, ఈ నేరం చేసిన తీవ్రవాదులు తప్పకుండా అరెస్ట్ కాబడతారనే విశ్వాసం తనకు ఉన్నట్లు తెలిపారు." మేము దేవుని నిర్ణయాలు పై ధన్యవాదాలు తెలియచేస్తున్నాం ,నా సోదరుడు దేశ భద్రత కోసం తన విలువైన ప్రాణాన్ని త్యాగం చేశాడు. విధి నిర్వహణలో నెలకొరిగేడని సగర్వంగా భావిస్తున్నామని ," ఆలీ అల్ ఖ్ఓబి ఆదివారం పేర్కొన్నాడు. "నా సోదరుడు వివాహం కాబడి నలుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడని , చివరిసారిగా మేము గత సోమవారం ఈద్ అల్ అధా రోజున చూసేమని .అతని గమ్యం శనివారం సాయంత్రం కాబడేసరికి అమరవీరుడుగా మారిపోయాడని కన్నీళ్ల మధ్య గద్గద స్వరంతో ఆయన వాఖ్యానించాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







