ఖైదీలకు డ్రోన్ హెలికాఫ్టర్ ద్వారా మాధకద్రవ్యాల సరఫరా
- September 18, 2016
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకొంటుందో ఏమోగానీ...విద్రోహశక్తులు మాత్రం విన్నూత్న ప్రయోగాలు చేస్తూ..అధికారులకు మతులు పోగొడుతున్నారు.
సెంట్రల్ జైల్ వద్ద ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్ జైలు హాల్ పై భాగంలో ఒక వింత ధ్వని వినడం జరిగింది. ఆ శబ్దం ఏమై ఉంటుందోనని ఆయన నిశితంగా పరిశీలన చేయగా ఒక రిమోట్ తో నియంత్రించే డ్రోన్ హెలికాఫ్టర్ చూడటం జరిగింది. దానితో విస్తు పోయిన ఆ అధికారి మరింత పరీక్షగా ఆ ఎగిరే బొమ్మలాంటి హెలికాఫ్టర్ అడుగు భాగంలో ఒక పెద్ద ప్యాకేజీ ఉందని గ్రహించారు. ఆ అధికారి ప్యాకేజీ తెరిచి చూడగా అనుమానిత తెల్లని రంగు గల పౌడర్ ఉన్న మూడు ప్లాస్టిక్ సంచులు దొరికేయి. వాటిని పరిశీలించి చూడగా అదో శక్తివంతమైన మత్తు కల్గించే మాదక ద్రవ్యంగా గుర్తించడం జరిగింది. జైలులో ఉన్న ఖైదీలలో కొందరకి ఈ తరహా సరఫరా ద్వారా సరఫరా చేస్తున్నట్లుగా ఆయన గ్రహించి వెంటనే ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించారు. ఈ అక్రమ రవాణా పై ఒక కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







