యూఏఈ విజిట్ వీసా కొత్త రూల్
- September 18, 2016
యూఏఈ: యూఏఈ విజిట్ వీసా కొత్త రూల్ ప్రకారం, తమ విజిట్ వీసాని ఎవరైనాసరే రెసిడెన్సీ వీసాగా అయినా, ఎంప్లాయ్‌మెంట్ వీసాగా అయినా మార్చుకోవడానికి దేశం విడిచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ పాత రూల్స్ ప్రకారం వీసా మార్పు కోసం పొరుగు దేశాలకు వెళ్ళడమో లేదంటే స్వదేశానికి వెళ్ళడమో చేయాల్సి ఉంటుంది వలసదారులు. అయితే కొత్త విధానం ద్వారా యూఏఈలోనే వుంటూ, తమ వీసా స్టేటస్‌ని మార్చుకోవచ్చు. కొత్త ఉద్యోగాల్ని వెతుక్కున్న వలసదారులకు ఈ కొత్త నిబంధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ స్టేటస్‌ని మార్చుకునే సౌకర్యం వల్ల, వలసదారులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వలసదారుల కుటుంబ సభ్యులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరం అని రెసిడెన్సీ అండ్ పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అఇకార ప్రతినిథి రషీద్ సుల్తాన్ అల్ ఖాదర్ ఈ వివరాల్ని వెల్లడించారు. ట్రాన్సిట్ వీసాలు, షార్ట్ టెర్మ్, లాంగ్ టెర్మ్, స్టూడెంట్, మెడికల్ ట్రీట్‌మెంట్, రెసిడెన్స్ వీసాలకూ ఈ కొత్త విధానం వర్తిస్తుంది. విజిటర్స్ తమ వీసా రెన్యూవల్ కోసం 570 దిర్హామ్స్ చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







