మహేష్ బాబు రెండు సినిమా షూటింగ్ లలో పాల్గొనడం ఇదే మొదటిసారి!
- September 19, 2016
ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం టాలీవుడ్ లో చాలా తక్కువ. స్టార్ హీరో.. ఒకసారి ఒక సినిమానే అనే కాన్సెప్ట్‌ని మనోళ్లు అంత స్ట్రిక్ట్ గా పాటించేస్తున్నారు. బాలీవుడ్‌లో షారూక్ లాంటి స్టార్స్ కూడా ఇలాంటివి అప్లై చేయరు కానీ.. మనోళ్లు మాత్రం ఫాలో అయిపోతుంటారు. అందుకే ఈ బ్యాడ్ ట్రెండ్‌కి బ్రేక్ వేసి.. కొత్తగా ట్రై చేయబోతున్నాడట మహేష్ బాబు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటిస్తాడనే సంగతి తెలిసిందే. సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ జనవరి చివరికే పూర్తయిపోతుందనే విషయమూ పాతదే. అయితే.. ఆ తర్వాతే అసలు కథ మొదలు కానుంది. మురుగతో షూటింగ్ పూర్తి కాగానే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపి బ్యానర్ మూవీని సూపర్ స్టార్ స్టార్ట్ చేసేయనున్నాడు.
అయితే.. ఈ మూవీతో పాటే.. కొరటాల దర్శకత్వంలో కూడా కొత్త సినిమా షూటింగ్ మొదలైపోతుందట. ఒకేసారి మహేష్ బాబు ఇలా రెండు సినిమా షూటింగ్ లలో పాల్గొనడం ఇదే మొదటిసారి కానుంది.
ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే.. ఇప్పటికే వీటి రిలీజ్ లపై కూడా మహేష్ దగ్గర క్లారిటీ ఉందంటున్నారు. కొరటాలతో చేయనున్న మూవీ రాబోయే దసరాకి విడుదల చేయనుండగా.. వంశీ పైడిపల్లితో సినిమాని సంక్రాంతి రేస్ లో నిలబెడతాడట.
మహేష్ లాంటి టాప్ హీరో ఇలా స్పీడ్ పెంచేయడాన్ని అభిమానులతో పాటు ఇండ్రస్టీ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేయడం ఖాయం
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







