ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం ముదిరిపాకాన పడింది..
- September 19, 2016
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం ముదిరిపాకాన పడింది. రాజధాని విషయంలో ఇప్పటికే కోర్టుకెక్కిన సీనియర్ జర్నలిస్టు ఏబీకె ప్రసాద్ అక్కడితో వదల్లేదు. లేటెస్ట్‌గా ఈ వ్యవహారాన్ని రాజకీయ మలుపు తిప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో ఇక్కడొక పెద్ద ఆరాచకమే జరిగిపోతోందంటూ కేంద్ర నాయకత్వానికి పితూరీలు పంపారు. రాష్ర్టపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి ఈ మేరకు ఏబీకె పంపిన ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
రాజధాని ప్రాంతంలో పంట భూములు తగలబడడం, రైతాంగం నుంచి భూసేకరణ వివాదం, అమరావతికి 'వరద ముప్పు', కొండవీటి వాగు ఇష్యూ వంటి అంశాలపై ప్రభుత్వం అస్పష్ట వైఖరితో ముందుకెళ్తోందని ఏబీకే ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
అలాగే సీఆర్‌డీఏ భూములను కొనుగోలు చేసినట్టు స్వయానా కేంద్రమంత్రి సుజనాచౌదరే అంగీకరించిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు ఏబీకే. సో.. అమరావతి పంచాయితీ ఢిల్లీకి చేరిందన్నమాట.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







