సింగం 3 చిత్రo ఫస్ట్ లుక్ విడుదల..

- September 19, 2016 , by Maagulf
సింగం 3 చిత్రo ఫస్ట్ లుక్  విడుదల..

సూర్య ...ఈ పేరు అటు తమిళం, ఇటు తెలుగు ఆడియన్స్ కు ఇప్పుడు బాగా ఫెమీలియర్ అయింది. హీరో సూర్యకు రెండు భాషల్లోనూ పాపులారిటీ ఉంది. సింగం సిరీస్ లో మాస్ కేరక్టర్స్ చేసిన సూర్య 24లో టిపికల్ రోల్ వేసి భేష్ అనిపించుకున్నాడు. సూర్య రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వాడు. సాదా సీదా కేరక్టర్ లు చేయడంపై సూర్య పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టడు. అయితే ఈ మధ్య సూర్య అన్నీ పవర్ ఫుల్ కేరక్టర్స్ చేస్తున్నాడు. ఎక్స్ పెరిమెంట్లు చేస్తున్నాడు. అతని పిక్చర్లకు మంచి టాక్ వస్తోంది. అతను చేసే కేరక్టర్ లకు ప్రశంసలు కురుస్తున్నాయి.సూర్య ప్రస్తుతం హరి దర్శకత్వంలో సింగం3 అనే చిత్రాన్ని చేస్తోండగా, తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.సూర్య ఇందులో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అభిమానులను అలరించడం ఖాయమని చెబుతున్నారు. ఇక సూర్య సరసన అందాల భామ శృతి హాసన్, వర్సటైల్ యాక్ట్రెస్ అనుష్క కథానాయికలుగా నటిస్తున్నారు. దాదాపు ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను వైజాగ్ లో జరిపినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళీ భాషలలో సింగం 3 డిసెంబర్ 16న విడుదల కానుండగా ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com