నరుడా..!డోనరుడా! ఫస్ట్‌లుక్
- September 19, 2016
హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోనరుడా..! ఫస్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లోని విలక్షణత వల్ల ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమాతో పల్లవి సుభాష్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. తనికెళ్ళభరణి ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.
గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన మల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క్షణం వంటి సూపర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించిన షనీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, క్షణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కిట్టు విస్సాప్రగడ, సాగర్ రాచకొండ మాటలు అందిస్తున్నారు. వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్దస్త్ శేషు, సుంకరలక్ష్మి, పుష్ప, చలపతిరాజు ఇతర తారాగణంగా నటించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







